కేసీఆర్ వల్లే పేదింటి ఆడ బిడ్డల కల నెరవేరుతుంది: హరీశ్ రావు

కేసీఆర్ వల్లే  పేదింటి ఆడ బిడ్డల కల నెరవేరుతుంది: హరీశ్ రావు

సీఎం కేసీఆర్ జిల్లాకో  మెడికల్ కాలేజీ లక్ష్యం సాకారం అవుతుండటంతో డాక్టర్ కావాలనే తెలంగాణ బిడ్డల కల నెరవేరుతుందన్నారు మంత్రి హరీశ్ రావు.   ఓ కూలి బిడ్డ, ఓ రైతు బిడ్డ, ఓ ఆటో డ్రైవర్ కొడుకు.. ఇలా ఎంతో మంది నిరుపేద పిల్లలకు నేడు వైద్య విద్య చేరువ అయ్యిందన్నారు.

వైద్య సీట్లు పొందిన వారిలో ఎక్కువగా మహిళలే ఉండటం సాధికారతకు నిదర్శనమని హరీశ్ రావు అన్నారు.   తెలంగాణ ప్రభుత్వం అందించిన గొప్ప అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  విజయవంతంగా వైద్య విద్య పూర్తి చేసి పేద ప్రజలకు మంచి వైద్య సేవలందించి రుణం తీర్చుకోవాలని కోరారు. 

 Also Read : ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు.. బయటకు రాకండి

ఇటీవల సీఎం కేసీఆర్ తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. వీటితో కలిపి తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26కు చేరింది.  మొత్తం రాష్ట్రంలో 3,915 మెడికల్ సీట్లు అందుబాటులో ఉన్నాయి