బండి సంజయ్ చేయనప్పుడు..ఈటల చేస్తాడా?

V6 Velugu Posted on Sep 15, 2021

హుజురాబాద్ లో  గెల్లు శ్రీనివాస్ గెలుపుతో రాష్ట్ర భవిష్యత్తు ఉందన్నారు మంత్రి హరీశ్ రావు.గెల్లు శ్రీనివాస్ గెలిస్తే  తమ బాధ్యత పెరుగుతుందన్నారు. ఒకవేళ టీఆర్ఎస్ చేయకుంటే మళ్ళీ రెండు సంవత్సరాల్లో మీ చేతిలోనే ఆయుధం ఉందన్నారు. బీజేపీ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి జరగదన్నారు. బండి సంజయ్ గెలిచిప్పటి నుంచి హుజురాబాద్ నియోజకవర్గంలో కనీసం 10 లక్షల విలువైన పని కూడా జరగలేదన్నారు. బండి సంజయ్ అభివృద్ధి చేయనప్పుడు..ఈటల రాజేందర్  అభివృద్ధి చేస్తారా అని ప్రశ్నించారు.  కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో LIC ఏజెంట్స్ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు..  బీజేపీ దేనిని వదలడం లేదన్నారు.  ఎల్ఐసీని ప్రైవేటీకరణ చేస్తామన్న బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు. ఎల్ఐసీని రక్షించుకోవడం కోసం దేశ వ్యాప్తంగా ఎల్ఐసీ  ఏజెంట్స్  అంత ఒక్కటవ్వాలన్నారు.

Tagged meeting, Minister Harish rao, Huzurabad, Karimnagar, LIC agents

Latest Videos

Subscribe Now

More News