
మున్సిపాలిటీ ఎన్నికల తర్వాతే 30 రోజుల ప్రణాళిక అమలు
హుజూర్ నగర్ గెలుపులాగే.. మున్సిపాలీటీల్లో గెలుస్తాం..
పంచాయతీలకు నెలకు 339 కోట్లు ఇస్తున్నాం
పైసలు తెస్తా.. సంగారెడ్డిని డెవలప్ చేస్తా… హరీష్
కేసీఆర్ ప్రభుత్వంలో 70ఏళ్ల దరిద్రం కొట్టుకుపోయిందని అన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో మాట్లాడిన ఆయన… గ్రామపంచాయితీలు ఇంత అద్భుతంగా మారతాయని ఎవరూ ఊహించలేదని అన్నారు. పంచాయతీ ప్రణాళికతో పల్లెల రూపురేఖలు మారాయని అన్నారు. దేశంలో ఎక్కడికి పోయినా తెలంగాణ డెవలప్ మెంట్ గురించే మాట్లాడుకుంటున్నరని అన్నారు. దాని ఫలితమే హుజూర్ నగర్ విజయం అని చెప్పారు. తెలంగాణ డెవలప్ మెంట్ చూసి… కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మెచ్చుకున్నరని తెలిపారు.
దేశంలో 24 గంటల కరెంట్, మిషన్ భగీరథ ఇవి ఒక్క తెలంగాణలోనే అమలు జరుగుతున్నయని… అన్నరు హరీష్ రావు. మున్సిపల్ ఎన్నికల్లో హుజూర్ నగర్ ఫలితాలే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2635తండాలు పచాయీతీలు చేశామని …12,751 పంచాయితీలకు ట్రాక్టర్లు ఇవ్వడం రాష్ట్ర సర్కారు ఘనత అని అన్నారు. పంచాయతీలకు నెలకు 339 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. 70 ఏళ్ల స్వతంత్ర్యంలో ఏ పంచాయతీకి ట్రాక్టర్లు లేవ్వలేదని అన్నారు.
948 పాత బావులను, 575 పాత బోర్ వెల్స్ , 2738 పెంట కుప్పలను సంగారెడ్డి జిల్లాలో పూడ్చి వేశామని తెలిపారు హరీష్. పల్లేల్లో పారిశుధ్య రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించామని అన్నారు. పైసలకు ఇబ్బంది లేదు.. ఈజీఎస్, పంచాయతీ కి ఎంత్తైనా ధనం ఇస్తామని చెప్పారు. పైసల బాధ్యత తనదని… గ్రామాల్లో ఎవరు ఫస్ట్ గ్రేవ్ యార్డు, డంప్ యార్డులు కంప్లీట్ చేస్తే ఆ ప్రజా ప్రతినిధులకు ఫస్ట్ సన్మానం చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల తర్వాతే 30 రోజుల ప్రణాళిక అమలు చేస్తాం.