ఏడాది క్రితమే ఎయిమ్స్ కు 201 ఎకరాలు ఇచ్చాం

ఏడాది క్రితమే ఎయిమ్స్ కు 201 ఎకరాలు ఇచ్చాం

కేంద్రమంత్రి  కిషన్ రెడ్డి నిమ్స్ ఆస్పత్రి, మెడికల్ కాలేజీ విషయంపై అన్నీ అబద్ధాలే చెబుతున్నారని ఆరోపించారు మంత్రి హరీశ్ రావు. ప్రెస్ మీట్ లో మాట్లాడిన హరీశ్.. కేసీఆర్ కిట్ లో కేంద్రం డబ్బుల్లేవన్నారు. ఎయిమ్స్ మెడికల్ కాలేజీకీ రాష్ట్రం స్థలం ఇవ్వలేదంటున్నారని..ఏడాది క్రితమే 201 ఎకరాల 24 గుంటల స్థలం ఇచ్చామన్నారు. బీబీనగర్ నగర్ నిమ్స్ బిల్డింగ్ ను ఎయిమ్స్ కోసం ఇచ్చామన్నారు. కిషన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు. బీజేపీ నేతలు చెబుతున్నవన్నీ అబద్ధాలేనన్న హరీశ్..నిమ్స్ కోసం ఏ రాష్ట్రం  స్థలం ఇవ్వదన్నారు.

జిల్లా ఆస్పత్రులను మెడికల్ కాలేజీలు అప్ గ్రేడ్ చేయాలని కేంద్రాన్ని అడిగామన్నారు మంత్రి హరీశ్. అయితే..చెయ్యలేమంటూ కేంద్ర మంత్రి నడ్డా 2015లో రాష్ట్రానికి లెటర్ రాశారని తెలిపారు. మెడికల్ కాలేజీ కోసం 2015, 2019 లో నడ్డ, హర్ష వర్ధన్ లని కలిసి అడిగామన్నారు. ఫేజ్ 1,2 లో మేము తెలంగాణ కు ఇవ్వలేదు.. ఫేజ్ 3 లో పరిశీలిస్తాం అని హర్ష వర్ధన్ లేఖ రాశారు. అప్పుడు కూడా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదన్నారు. మెడికల్ కాలేజ్ లు ఇవ్వడం లో తెలంగాణ కు కేంద్రం అన్యాయం చేసిందన్నారు. కేసీఆర్ కిట్ లో కేంద్రం రూ.5 వేలు ఇస్తోందని నిరూపించకపోతే ..కిషన్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. గ్యాస్ పై రాష్ట్రం పన్నులు వేయడం లేదన్నారు హరీశ్ రావు.