
కరీంనగర్ జిల్లా ఆస్పత్రిని ఆకస్మికంగా మంత్రి హరీశ్ రావు సందర్శించారు. హాస్పిటల్ లోని పలు వార్డులలో తిరిగి రోగులకు అందుతున్న వైద్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతుల కల్పనకు సంబంధించి వైద్యులను ఆరా తీశారు. పేదలకు అందుతున్న వైద్యంపై మంత్రి హరీష్ రావు సంతృత్తి వ్యక్తం చేశారు.
ఆస్పత్రిని సందర్శిస్తున్న సమయంలో డయాలసిస్ సెంటర్లో ఓవృద్ధురాలు తనకు ఫించన్ రావడం లేదని మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లింది. ఈ సందర్భంగా కొన్ని మందులు కూడా ఇవ్వడం లేదని మరో మహిళ చెప్పినట్టు సమాచారం. కొంతమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా మంత్రిని కలిసి తమను పర్మినెంట్ చేసి జీతాలు పెంచాలని కోరారు. అయితే మంత్రి హరీష్ రావు వారి సమస్యలను త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందజేస్తున్నామని తెలిపారు.