
మెదక్: టిఆర్ఎస్ సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరూ సంతోషంగా తీసుకుంటారని ప్రతి ఇంట్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. అభివృద్ధిలో పోటీపడ్డట్టు..సభ్యత్వంలోనూ పోటీ పడాలన్నారు. ఆదివారం మెదక్ లో పర్యటించిన మంత్రి.. నగరంలో టిఆర్ఎస్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో మూడు రోజులు మెదక్ జైలులో ఉన్నామని తెలిపారు. తొలి అమరవీరుల స్థూపాన్ని చిన్న శంకరంపేట లో ఏర్పాటు చేసి కేసీఆర్ చే ప్రారంభించుకున్నామని గుర్తు చేసుకున్నారు. టిఆర్ఎస్ కార్యకర్తలంటే ఉద్యమకారులని, జాతీయ పార్టీల్లో పనిచేసే నాయకులు ఢిల్లీలో గులాం గిరి చేస్తున్నారన్నారు.
రైతు యాత్రల పేరిట.. కాంగ్రెస్ నాయకులు కుర్చీల కోసం పాదయాత్ర చేస్తున్నారు.. రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే తిన్నది అరగక చేసుకున్నారని ఒకప్పుడు అన్నది కాంగ్రెసోళ్లు కాదా..? ఎరువుల కోసం వస్తే రైతులను లాఠీచార్జి చేసింది కాంగ్రెస్ కాదా..? కాంగ్రెసోళ్లది రైతు యాత్ర కాదు.. రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతు బంధు, ఉచిత కరెంట్ , రైతు భీమా ఇస్తున్నారా? అని ప్రశ్నించారు హరీష్ రావు. రైతుల కోసం టిఆర్ఎస్ చేస్తున్న పథకాల గురించి సోనియా గాంధీ కి చెప్పండని.. ఆప్పుడైనా కాంగ్రెస్ బాగుపడుతది అని హరీష్ విమర్శించారు.
దరఖాస్తు పెట్టకుండానే టిఆర్ఎస్ సర్కార్ ఎకరాకు రూ 10 వేలు ఇస్తుందన్నారు. ఘనపురం కాల్వలు బాగుపడ్డాయంటే అది టిఆర్ఎస్ పుణ్యమే.. మంజీర, హల్దీ మీద చెక్ డ్యామ్ లు కట్టింది టిఆర్ఎస్ పార్టీ. బీజేపీ,కాంగ్రెస్ లు ఢిల్లీలో గులాంగిరి చేసే పార్టీలని అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిపక్షాలు చేసే ద్రుష్పచారాన్ని తిప్పి కొట్టాలన్నారు