ఆకలైనప్పుడు అన్నం పెట్టనోళ్లు.. ఇప్పుడు గోరు ముద్దలు పెట్టడానికి వస్తున్నరు

ఆకలైనప్పుడు అన్నం పెట్టనోళ్లు.. ఇప్పుడు గోరు ముద్దలు పెట్టడానికి వస్తున్నరు

ఆకలైనప్పుడు అన్నం పెట్టనోళ్లు.. ఓట్ల సమయంలో గోరు ముద్దలు పెట్టడానికి వస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. అలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 60 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎందుకు నీళ్లు ఇవ్వలేదు, ఉద్యోగ నియామకాలు, నాణ్యమైన విద్యుత్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హమీలు గుప్పించిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని.. మోసపోతే.. గోస పడతామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో మెడికల్ కాలేజీలు వచ్చాయని మంత్రి హరీష్‌రావు  తెలిపారు. ఏడాదికి 10వేల మంది వైద్యులను తయారు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో కరువు, కష్టాలు తాండవిస్తుంటే మన తెలంగాణా మాత్రం కేసీఆర్ పాలనలో సుభిక్షంగా శోబిల్లుతుందని చెప్పుకొచ్చారు. 

ALSO READ: కాంగ్రెస్ లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి

శనివారం(సెప్టెంబర్ 16) సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో బీసీ, ఎంబీసీలకు, మైనార్టీలకు మంత్రి హరీష్ రావు చెక్కులను పంపిణీ చేశారు. జీఓ 58, 59 పట్టాల పంపిణీతో పాటు కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు అందజేశారు. 

మైనార్టీల అభివృద్ధికి, సంక్షేమానికి ఏ ఇతర రాష్ట్రాలు కేటాయించని విధంగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కేవలం ఓట్లను లూఠీ చేసేందుకు కుట్ర పన్నుతున్నాయన్నారు. త్వరలోనే మెట్రో రైలు మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు విస్తరణ జరగబోతుందని చెప్పారు. పఠాన్‌చెరు నియోజకవర్గంలో దాదాపు 173 దేవాలయాలను నిర్మాణం చేసిన ఘనత బీఆర్ఎస్ దే అని అన్నారు.