
కరోనా నేపథ్యంలో ప్రపంచం అంత ఒకతాటి పై నడుస్తుంటే.. కొన్ని రాజకీయ పార్టిలు మాత్రం శవాల మీద పేలాలు ఏరుకుంటూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. సోమవారం సంగారెడ్డి లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన సమయంలో రాజకీయాలు చెస్తున్నారని, అలాంటి రాజకీయ పార్టీలను ప్రజలు ఇప్పటికే ఐసోలెషన్ చేసి క్వారైంటైన్ లో ఉంచారన్నారు. అయినా కూడా వారిలోని వైరస్ మళ్లీ బయటకు వచ్చినట్టుందని ఎద్దేవా చేశారు.
వారందరికీ కరోనా కన్నా భయంకరమైన వైరస్ పట్టుకుందని చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్ కరోనాను కట్టడి చేసేందుకు అన్ని జాగ్రత్తలు తిసుకుంటున్నామని, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తెలంగాణ ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారన్నారు హరీష్ రావు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండడానికి గతంలో కన్నా ఎక్కువ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అయినా కూడా ఒక నాయకుడు రౌండ్ టెబుల్ సమావేశం ఏర్పాటు చేస్తానని, మరో నాయకుడు దహన సంస్కారాలపై రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు
సంగారెడ్డి జిల్లాలో ఎక్కువ మంది వలస కూలిలు ఉన్నారని చెప్పిన హరీష్ రావు ..వారందరికీ సహాయం చేశామని, మరో 15000 మందికి సహాయం చెయనున్నట్టు చెప్పారు. మొత్తంగా 38,000 కు పైగా వలస కూలిలకు సహాయం చేశామన్నారు కాంగ్రెస్,బిజేపి పాలిత రాష్ట్రాలలో ఎక్కడైన వలస కూలిలకు భరోసా ఇచ్చారా..సహాయం చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6లక్షల మంది వలస కూలిలకు తమ ప్రభుత్వం అండగా ఉన్నట్టు తెలిపారు.
మార్చ్ 22 నాడే తెలంగాణ లో బియ్యం ఇస్తామని ప్రకటించామని హారీష్ రావు తెలిపారు. 92 శాతం మందికి రేషన్ కార్డుల ద్వారా బియ్యం పంపిణి చేస్తే.. కొందరు నాయకులు కనీస అవగాహాన లేకుండా కేంద్రం బియ్యం ఇచ్చిందని ప్రచారం చేస్తున్నారన్నారు. లాక్ డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉండిపోయిన రాష్ట్ర ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం బ్యాంకుల కు డబ్బులు కూడా విడుదల చేసిందని మంత్రి తెలిపారు. 87 లక్షల కార్డులకు డబ్బులు పంచడం అనేది అంత సులువు కాదని చెప్పారు. ఇప్పటికే అకౌంట్లు సేకరించామని, అకౌంట్లలో డబ్బులు వేసే కార్యక్రమం కూడా ప్రారంభమైందని అన్నారు.
రబీ సాగులో గతంలో ఎప్పుడు ఇంత పంట పండలేదని, అంత ఎక్కువ దాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 643 వరి కొనుగోలు కేంద్రాలు , 83మొక్కజోన్న13 శనగల కొనుగోలు కెంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్ర సంక్షేమం కోసం ఇన్ని చర్యలు చేపడుతుంటే ప్రతిపక్షాలకు కనపడడం లేదని ఆయన అన్నారు.