మేం చేసినయే ప్రచారం చేసుకుంటున్నం

మేం చేసినయే ప్రచారం చేసుకుంటున్నం

హైదరాబాద్: బీజేపీలో విషం తప్ప విషయం ఉండదని మరోసారు రుజువైందన్నారు మంత్రి హరీష్ రావు. బీజేపీ విజయ సంకల్ప సభను ఉద్దేశించి మాట్లాడిన హరీష్.. రాష్ట్రానికి మోడీ ఏం ఇచ్చారో  చెప్పలేకపోయారన్నారు. అసత్యాలు, గ్లోబల్ ప్రచారాలు తప్ప ఏమీ లేదన్న హరీష్.. రాష్ట్రానికి నిధులు ప్రకటిస్తారన్న ప్రజల ఆశలపై మోడీ నీళ్లు చల్లారని తెలిపారు. 18 రాష్ట్రాల సీఎంలు రాష్ట్రానికి వచ్చారని.. తమ రాష్ట్రంలో తెలంగాణ కన్నా అద్భుతమైన పథకం ఉందని ఎవరైనా చెప్పారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి నీళ్లిచ్చాం కాబట్టే సాగు పెరిగిందని తెలిపారు. బీజేపీ నేతలు తెలియకుండా విమర్శలు చేశారని..రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మీ, వ్యవసాయానికి 24 గంటల కరెంటు లాంటి ఎన్నో పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే .. అసత్యాలను ప్రజలు నమ్మరన్నారు. మేం చేసినవే చెప్పుకుంటున్నామన్న మంత్రి హరీష్.. స్క్రిప్ట్ రైటర్ల తప్పుడు రాతలను బీజేపీ నేతలు చదివిపోయారని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే తిరోగమనమే అన్నారు.

అయ్యా ప్రధానమంత్రిగారూ.. నిధులు వచ్చాయా అని అడిగే ముందు.. నిధులిచ్చారా చెప్పండని ప్రశ్నించారు. మా అభివృద్ధి చూసి తెలంగాణ ప్రజలు చెప్పాలి కానీ.. మీరు విమర్శలు చేస్తే ఎవ్వరు నమ్మరని తెలిపారు. ఇటీవలే అతిపెద్ద ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటించలేదా.. కేంద్ర ప్రభుత్వంలో 1600 లక్షల ఉద్యోగాలు ఎందుకు నింపలేదో చెప్పాలన్నారు. మీరు నింపరు.. మేం నింపింది కనిపించదా అన్న హరీష్.. లెక్క తేల్చాలని సవాల్ విసిరారు. ఇది ఉద్యమాల గడ్డ అని.. ప్రతి విషయాన్ని గమనించే శక్తి మా తెలంగాణ ప్రజలకుందన్నారు. వేరే రాష్ట్రాల్లో మీ పప్పులుడుకుతయ్ కానీ.. తెలంగాణలో చెల్లయ్ అని చెప్పారు.

మా హెల్త్ స్కీంల ముందు మీ ఆయుష్మాన్ భారత్ ఎంత అన్నారు. మహిళల గురించి మాట్లాడే ప్రధాని.. ముందు పెంచిన సిలిండర్ ధర గురించి మాట్లాడాలన్న హరీష్.. మహిళా రిజర్వేషన్ ఏమాయే అని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులకే మీరేమైనా సాయం చేశారా..? జాతీయ హోదా ఇచ్చారా అన్నారు. మేం అనుకున్నం 2 రోజులు హైదరాబాద్ లో ఉన్న ప్రధాని మోడీ తెలంగాణకు ఏదైనా భారీ ప్యాకేజీ ఇస్తడేమోనని కానీ .. సప్పగా సదురుకున్నడన్నారు. నీళ్లపై మా లెక్కతేల్చమన్నా ఇంతవరకు క్లారిటీ ఇవ్వరని.. ప్రపంచం మెచ్చిన కాళేశ్వరం గొప్పతనం మీకు అర్ధం కాదన్నారు మంత్రి హరీష్ రావు. ఎనీ టైం మీటర్ కాదు.. ఎనీ టైం వాటర్ అనేదే కాళేశ్వరం అన్నారు. దొడ్డు బియ్యం కొనమని తొండాట ఆడిండ్రు.. కొన్ని నెలలపాటు బియ్యం లొల్లి పెట్టారన్నారు. ఒక్క పైసా సాయం చేయకపోతిరి..పైగా మా మీద విమర్శలా..

విదేశాల్లో దాచిన బ్లాక్ మనీ.. ఫెయిల్
24 గంటల్లో రుణాలు .. ఫెయిల్
అవినీతిరహిత పాలనా- ఫెయిల్
రుపాయి విలువ పెంచుతాం ఫెయిల్
బుల్లెట్ రైలు- ఫెయిల్
కరోనా కంట్రోల్..  ఫెయిల్
ఇవన్నీ వాస్తవం కాదా.. మేం చెప్పినవి చేయడమే కాకుండా చెప్పకుండా గొప్ప స్కీంలు తెచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి కేసీఆర్ ది అన్నారు. కానీ ప్రధాని మనకు మొండిచెయ్యి చూపించారని చెప్పుకొచ్చారు మంత్రి హరీష్ రావు.

https://youtu.be/vKAYgp6uic8