పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో శుక్రవారం ఓ ఇంట్లో పట్టపగలే దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన ఆదొండ సాయిలు పని మీద నర్సంపేట మండలం పాకాలకు వెళ్లగా, ఇంట్లో ఉన్న సాయిలు భార్య ఉమ, బిడ్డ పావనితో గ్రామంలోని ఓ ఫంక్షన్కు వెళ్లింది. ఇంటికి తిరిగి వచ్చే సరికి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న 25 తులాల బంగారు ఆభరణాలు, రూ.6 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. దొంగలు పడి బంగారం, నగదు ఎత్తుకెళ్లడంతో బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనా స్థలాన్ని పర్వతగిరి సీఐ రాజగోపాల్ పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.
