
జహీరాబాద్: జహీరాబాద్ అభివృద్ధి కోసం కేసీఆర్ రూ.50 కోట్లు కేటాయించారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో హరీష్ రావు పర్యటించారు. నగర బాటలో భాగంగా పలు వార్డులలో సైకిల్ పై పర్యటిస్తూ స్థానికుల సమస్యలను మంత్రి హరీశ్ రావు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్న గీతారెడ్డి జహీరాబాద్ అభివృద్ధిని పట్టించుకోలేదని హరీశ్ రావు ఆరోపించారు. జహీరాబాద్ మున్సిపాలిటీలో తాగు నీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. సంగమేశ్వర ప్రాజెక్ట్ ద్వారా లక్ష ఎకరాలకు గోదావరి జలాలు ఇస్తామన్నారు. మంత్రి హరీశ్ తో పాటు ఎమ్మెల్యే మాణిక్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నగర బాటలో భాగంగా పలు వార్డుల్లో సైకిల్ పై పర్యటించిన మంత్రి శ్రీ హరీష్ రావు గారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ స్థానికులు, మహిళలను కలుస్తూ సమస్యలు అడిగి తెలుసుకొని, వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. pic.twitter.com/3VuhhZHUlV
— Harish Rao News (@TrsHarishNews) April 19, 2022
మరిన్ని వార్తల కోసం...