డిజిటల్ కరెన్సీ వల్ల మనీ ల్యాండరింగ్కు అవకాశం

డిజిటల్ కరెన్సీ వల్ల మనీ ల్యాండరింగ్కు అవకాశం

వాషింగ్టన్: క్రిప్టోకరెన్సీపై మార్కెట్ లో అనిశ్చితి కొనసాగుతున్న టైమ్ లో.. క్రిప్టో గురించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లో జరిగిన సెమినార్ లో పాల్గొనేందుకు నిర్మలా సీతారామన్ నిన్న వాషింగ్టన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... డిజిటల్ కరెన్సీ వల్ల మనీ ల్యాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీతో నియంత్రణ చేయాలి కానీ... నియంత్రణ కోల్పోతే దేశానికే సమస్య అవుతుందన్నారు. కొవిడ్ టైమ్ లో డిజిటల్ లావాదేవీలపై ఆధారపడ్డ వారి సంఖ్య భారీగా పెరిగిందన్నారు. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, జీ20, ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. శ్రీలంక, ఇండోనేషియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వాషింగ్టన్ సమావేశాల తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో లో బిజినెస్ లీడర్లతో భేటీ కానున్నారు. 

మరిన్ని వార్తల కోసం...

దామరచర్ల గురుకులంలో ఫుడ్ పాయిజన్

ఈ ‘చాయ్వాలీ’ టీని తాగాల్సిందే బాస్