ఈ ‘చాయ్వాలీ’ టీని తాగాల్సిందే బాస్

ఈ ‘చాయ్వాలీ’ టీని తాగాల్సిందే బాస్

పట్నా: ‘చాయ్వాలా’, ‘చాయ్ పే చర్చ’ అనే పదాలు నేటి రాజకీయాల్లో తరచూ వినిపిస్తాయి. 2014లో మోడీ సారథ్యంలోని బీజేపీ విజయం సాధించినప్పటి నుంచి ఈ పదాలు బాగా వాడుకలోకి వచ్చాయి. చాయ్వాలా నుంచి ప్రధాని స్థాయికి మోడీ ఎదిగిన తీరు అందరకీ ఆదర్శమే. ఈ విషయాన్ని పక్కనబెడితే.. బిహార్లోని పట్నాకు చెందిన ఓ 24 ఏళ్ల అమ్మాయి తనను తాను చాయివాలీగా చెప్పుకుంటోంది. ఎకనామిక్స్లో గ్రాడ్యుయేట్ చేసిన ప్రియాంక గుప్తా అనే ఈ అమ్మాయి.. పట్నా విమెన్స్ కాలేజీకి సమీపంలో ఓ టీ స్టాల్ను ఏర్పాటు చేసింది. దీనికి చాయ్వాలీ అనే పేరు పెట్టింది. స్టాల్ పెట్టేందుకు లోన్ల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణాలు చేశానంటున్న ప్రియాంక.. చివరకు ఫ్రెండ్స్ ఇచ్చిన రూ.30 వేలతో షాపును పెట్టానంటోంది. 

తాగాల్సిందే బాస్
గ్రాడ్యుయేషన్ తర్వాత రెండేళ్లపాటు బ్యాంక్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం తీవ్రంగా చెమటోడ్చిన ప్రియాంక.. జాబ్ రాకపోవడంతో సొంతంగా బిజినెస్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలో స్నేహితులు చేసిన ఆర్థిక సాయంతో  ఏప్రిల్ 11న టీ స్టాల్ను స్టార్ట్ చేసింది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి మంచి పంచ్ లైన్లతో కూడిన బ్యానర్ను షాప్ దగ్గర ఉంచింది. ‘పీనా హీ పడేగా’ (తాగాల్సిందే), ‘సోచ్ మత్.. చాలూ కర్దే బస్’ (ఆలోచించకు.. మొదలుపెట్టు బాస్) లాంటి డైలాగ్స్తో ఉండే బ్యానర్ను ఏర్పాటు చేసింది. దీనిపై ప్రియాంక స్పందిస్తూ.. ‘ఎప్పుడూ నీడపాటున ఉండే నేను.. ఇప్పుడు రోజంతా మండిపోయే వాతావరణంలో స్టాల్ను నడిపిస్తున్నా. సక్సెస్ఫుల్ ‘చాయ్వాలీ’గా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నా. ‘ఎంబీఏ చాయ్వాలాగా’గా పిలిచే ప్రఫుల్ బిల్లోర్ నాకు స్ఫూర్తి. ఆయన వీడియోలు చూసే చాయ్‌వాలీగా మారాలని నిర్ణయించుకున్నా. ప్రతి రోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్తున్నా’ అని ప్రియాంక పేర్కొంది. బయట ఎంతోమంది చాయ్వాలాలు ఉన్నారని.. అలాంటప్పుడు ఒక చాయ్వాలీ ఉండొద్దా అని ఆమె ప్రశ్నించింది. ఉద్యోగాలు రాలేదని నిరాశలో ఉండటానికి బదులు.. స్వయంకృషితో వ్యాపారం చేస్తూ ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ప్రియాంక లాంటి అమ్మాయిలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పొచ్చు. 

మరిన్ని వార్తల కోసం:

బాహుబలిని మించిన మూవీ తీస్తా

నారాయణ్ దాస్ నారంగ్ ఇకలేరు

లాక్​డౌన్​ తర్వాత షాంఘైలో ఫస్ట్​ డెత్