లాక్​డౌన్​ తర్వాత షాంఘైలో ఫస్ట్​ డెత్

లాక్​డౌన్​ తర్వాత షాంఘైలో ఫస్ట్​ డెత్

బీజింగ్‌‌: చైనాలో కరోనా వ్యాప్తి ఆగడంలేదు. ఒమిక్రాన్‌‌ వేరియంట్‌‌తో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నయ్‌‌. షాంఘైలో ఇప్పటికీ 2.6‌‌‌‌0 కోట్ల మంది లాక్‌‌డౌన్‌‌లోనే ఉన్నరు. సోమవారం షాంఘైలో వైరస్‌‌ బారిన పడి ముగ్గురు వృద్ధులు చనిపోయారని చైనా హెల్త్‌‌ కమిషన్‌‌ తెలిపింది. షాంఘైలో లాక్‌‌డౌన్‌‌ విధించిన తర్వాత వైరస్​ మరణాలు నమోదవడం ఇదే మొదటిసారి. అయితే ఈ ముగ్గురు వ్యాక్సిన్‌‌ వేసుకోలేదని అధికారులు తెలిపారు. మార్చి 1 నుంచి ఇప్పటివరకు అక్కడ 3,72,000 కేసులు రికార్డయ్యాయి.