
గజ్వేల్, వెలుగు: వంద శాతం రాబోయేది కేసీఆర్ గవర్నమెంటేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం ఆయన నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్‌కు చాలా మంది వచ్చి ఏదేదో మాట్లాడతారు మనల్ని మభ్య పెడతారు.. కానీ 30వ తేదీ తర్వాత ఎవరూ కనిపించరు అని ఎద్దేవా చేశారు.
ఒకప్పుడు గజ్వేల్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం ఆలోచించాలన్నారు. కేసీఆర్ ఇక్కడ ఉండటం గజ్వేల్ ప్రజల అదృష్టంమన్నారు. ఇక నుంచి సీఎం కేసీఆర్ నెలకు ఒక్కరోజు మీతో గడుపుతా నని మాట ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ నేతలు అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాలు కచ్చితంగా గెలుస్తామన్నరు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, పార్టీముఖ్య నాయకులు పాల్గొన్నారు.