కాంగ్రెసోళ్లది దొంగ కరెంట్..కేంద్రం రూ.2500కోట్ల ఆఫర్ ను తిరస్కరించాం

కాంగ్రెసోళ్లది దొంగ కరెంట్..కేంద్రం రూ.2500కోట్ల ఆఫర్ ను తిరస్కరించాం

దుబ్బాక నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పర్యటనలో భాగంగా హరీష్.. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 4వ వార్డు దుంపలపల్లిలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న మురికి నీటి కాల్వులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం 16 సంఘాలకు భవనాలు కావాలని కోరారని.. రెండు రోజుల్లో రూ. కోటి రూపాయాల్ని మంజూరు చేయించి నిధులు పంపిస్తామన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 3 వేల ఇండ్ల నిర్మాణానికి కాలనీలను నిర్మించాం.  గతంలోనే అసెంబ్లీలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇచ్చినట్లు, కరోనా నేపథ్యంలో కొద్దిగా ఆలస్యం జరుగుతున్నదని మంత్రి పేర్కొన్నారు.

ప్రతీ నియోజకవర్గ పరిధిలో వెయ్యి ఇండ్లు వారి సొంత స్థలంలో నిర్మించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు, దుబ్బాకకు వెయ్యితో పాటు అదనంగా వెయ్యి ఇండ్ల నిర్మాణాలు చేసుకునేలా సీఎం కేసీఆర్ అనుమతి తీసుకుందామన్నారు.

పెళ్లి బరువు తల్లికి తెలుసని తల్లి పేరిట కల్యాణ లక్ష్మీ చెక్కులను అందిస్తున్నాం. ఇప్పటి దాకా తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల పెళ్లిలకు రూ.5555 వేల కోట్ల నిధుల్ని కేటాయించామని చెప్పారు.

ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ..టీడీపీ అధినేత చంద్రబాబు బాయిల కాడ బోర్లకు మీటర్లు పెడతానంటే.. రైతులంతా బాబుకు మీటర్లు పెట్టి వెనక్కి పంపారని ఎద్దేవా చేశారు. అదే విధంగా బీజేపీ ప్రభుత్వానికి దుబ్బాక ప్రజలు తగిన గుణపాఠం ఓటు రూపంలో చెప్పాలని కోరారు.

బాయిల కాడ మీటర్లు పెడితే.. రూ. 2500 కోట్లు ఇస్తామని కేంద్రం ఆఫర్ చేస్తే ..ఆఫర్ ఇస్తే .. మీటర్లు వద్దు,  2500 కోట్లు వద్దు.. మా తెలంగాణ రైతుల సంక్షేమమే మాకు ముద్దు అని సీఎం కేసీఆర్ తిరస్కరించినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు వస్తుందని హామీ ఇచ్చారు.

కరోనా దృష్ట్యా ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాం. కానీ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఎక్కడా ఆపలేదన్న హరీష్.. కాంగ్రెసోల్లు పొద్దున్న దాకా 3 గంటలు, రాత్రిలో 3 గంటలు దొంగ కరెంటు ఇచ్చారన్నారు.

రాష్ట్రంలో సీఎం తెచ్చిన చట్టానికి రైతులు పాలాభిషేకం చేస్తే.. రైతుల నడ్డి విరిచే చట్టం తెచ్చిన కేంద్ర ప్రభుత్వం పై నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. .

కార్పోరేట్ కంపనీల ఒప్పందంతో చేసుకుని నయా జమీందారి వ్యవస్థను తెచ్చింది ఎవరి ప్రయోజనాల కోసమని ప్రశ్నించారు.