
సిద్దిపేట జిల్లా: గజ్వేల్ ఐఓసీ కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ శుక్రవారం కొండపోచమ్మ రిజర్వాయర్ ను ప్రారంభిస్తారని చెప్పారు. కొండపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలలో ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి పరిమిత ప్రజాప్రతినిధులకు మాత్రమే ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కేవలం గజ్వేల్ ప్రజాప్రతినిధులను మాత్రమే ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రజలు ఎవరూ కూడా ప్రారంభోత్సవానికి దయచేసి రావద్దని తెలిపారు. మనమందరం కలిసి జరుపుకోవాల్సిన జల పండగ కానీ కరోనా నేపథ్యంలో ఇది సాధ్యం కాదన్నారు. రేపటి తరువాత ప్రజలు ఎవరైనా వచ్చి సామాజిక దూరాన్ని పాటిస్తూ కొండపోచమ్మ రిజర్వాయర్ సందర్శించవచ్చని తెలిపారు.