మంత్రి హరీష్ కాన్వాయ్ని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు..

మంత్రి హరీష్ కాన్వాయ్ని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు..

ఇవాళ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వికారాబాద్ జిల్లాలోని పరిగి పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు మంత్రి కాన్వాయ్ ని అడ్డుకుని నిరసన తెలిపారు. వెంటనే పోలీసులు వారిని అరెస్టు చేశారు. కాగా, పరిగిలో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని హరీష్ రావు ప్రారంభించనున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటారనే సమాచారంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు హన్మంతు ముదిరాజ్, లాలు కృష్ణలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. దీంతో కాంగ్రెస్ నేతలు పోలిసులపై మండిపడ్డారు. అక్రమ అరెస్టులు చేయడం హేయమైన చర్యన్నారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం వికారాబాద్ జిల్లాకు చేసిందేం లేదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.