పెబ్బేరు, వెలుగు: కాంగ్రెస్తోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్‌లుగా గెలిపించాలని కోరారు. శ్రీరంగాపూర్, పెబ్బేరులో ఆయన ఆదివారం మూడో విడత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్, మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కొంతమంది మోసపూరితంగా ఓటు వేయించుకోవాలని చూస్తున్నారని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.
