ఆర్మూర్ లో వ్యవసాయ బోరు మోటారు బిల్లులు ..ఒకేసారి చెల్లించిన రైతులు

ఆర్మూర్ లో వ్యవసాయ బోరు మోటారు బిల్లులు ..ఒకేసారి చెల్లించిన రైతులు

ఆర్మూర్, వెలుగు :  ఆర్మూర్ టౌన్​ లోని టీచర్స్​ కాలనీ శివారులోని ఏ వన్ జోన్ ఏజియల్ ట్రాన్స్​ఫార్మర్​ పరిధిలోని రైతులంతా కలిసి తమ వ్యవసాయ మోటార్లకు చెందిన రూ.34,253 మొత్తాన్ని ఆదివారం  ఒకేసారి చెల్లించారు. 

రైతులు తమ బిల్లులను జమచేసి విద్యుత్ అధికారులను పిలిచి ఒకేసారి చెల్లించారు. ప్రతి సంవత్సరం ఇక్కడి రైతులు ఇలాగే మోటర్ బిల్లులు చెల్లిస్తు తమకు సహకరిస్తున్నారని అధికారులున తెలిపారు. కార్యక్రమంలో సీనియర్  అసిస్టెంట్​ సుమన్, ఏఎల్ఎం జోసెఫ్, ఎల్ ఎం సంతోష్, ఐఎం గంగారం.  ఎల్​ఐ సీతారాములు, ఎఈ  గంగాధర్, రైతులు రమేశ్​, రాము, సురేశ్​, రాజు తదితరులు పాల్గొన్నారు.