మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: కరాటేలో సత్తా చాటడం అభినందనీయమని డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జడ్చర్ల పట్టణంలో ఇటీవల జరిగిన కరాటే చాలెంజర్ కప్ లో జిల్లా కేంద్రానికి చెందిన కింగ్ షోటోకాన్ కరాటే విద్యార్థులు కటాస్ బాలుర విభాగం బ్లాక్ బెల్ట్‌లో అర్ష్ జమీల్, బ్రౌన్ బెల్ట్‌లో అమాన్ ఖాన్, బ్లూబెల్ట్లో మహమ్మద్ షరీఫ్, పర్పుల్ బెల్ట్‌లో జుల్ఫికర్, బ్రౌన్ బెల్ట్‌లో సాబేర్ పాషా, వైట్ బెల్ట్‌లో అబుబాకర్ గ్రాండ్ చాంపియన్ షిప్ సాధించారు.
బాలికల విభాగానికి సంబంధించి పర్పుల్ బెల్ట్‌లో హఫ్సా బేగం, బ్లూబెల్ట్లో అయేషాబేగం, గ్రీన్ బెల్ట్‌లో ఖిజ్ర, వైట్ బెల్ట్‌లో అఫిపా కౌసర్ గ్రాండ్ చాంపియన్ షిప్ గెలిచారు. ఇతర విభాగాలకు సంబంధించి గుల్ ఫిషా, అహ్మద్, ఖాసీం అలీ, అయాన్ అలీ, బిలాల్ అజీమ్ బంగారు, అజీజ్ రజత, తనిష్ కాంస్య పతకాలు సాధించారు. డీసీసీ ప్రెసిడెంట్ఆదివారం వారిని సన్మానించారు. కింగ్ షోటోకాన్ ఫౌండర్ జహంగీర్ పాషా ఖాద్రీ, వైస్ చైర్మన్ చెన్న వీరయ్య, కోశాధికారి తిరుపతయ్య, అల్లీపూర్ సర్పంచ్ విజయలక్ష్మి, కాంగ్రెస్ జిల్లా మైనార్టీ జనరల్ సెక్రటరీ అబ్రార్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
