డెంగీ కేసులు పెరగకుండా చర్యలు తీసుకోండి

డెంగీ కేసులు పెరగకుండా చర్యలు తీసుకోండి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డెంగీ, టైఫాయిడ్ కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి హరీశ్‌‌‌‌రావు సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలున్న వారికి వెంటనే టెస్టులు చేసి, వీలైనంత త్వరగా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రారంభించాలన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల డీఎంహెచ్‌‌‌‌వోలతో హైదరాబాద్‌‌‌‌లోని ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌డీ నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసు వ్యాక్సినేషన్‌‌‌‌ను స్పీడప్ చేయాలని మంత్రి సూచించారు.