గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు రూ. 15 లక్షలిస్తున్నాం..చాలవా?: మంత్రి హరీష్ రావు

గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు రూ. 15 లక్షలిస్తున్నాం..చాలవా?: మంత్రి హరీష్ రావు

కోహెడ (హుస్నాబాద్​), వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్టు అడ్డుకోవద్దని నిర్వాసితులను మంత్రి హరీశ్‌‌రావు కోరారు. ప్రాజెక్ట్‌‌ పూర్తయితే, లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతుందని, 50 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ప్రాజెక్టు కోసం మిగిలిన భూ సేకరణకు రూ.23 కోట్లు మంజూరు చేశామన్నారు. సోమవారం హుస్నాబాద్‌‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి, మాట్లాడారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్‌‌‌‌లలో ఎకరాకు రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఇచ్చామని, గౌరవెల్లి నిర్వాసితులకు రూ.15 లక్షలు ఇస్తున్నామని చెప్పారు.

ఇంత చేసినా గొంతెమ్మ కోరికలు కోరుతూ పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చేతులెత్తి మొక్కుతున్నా..రైతుల కోసం రాజకీయాలకు అతీతంగా కలసి రావాలని కోరారు. ప్రాజెక్టు పనులు 98% పూర్తయ్యాయని, మిగిలిన పనులను బెదిరించి చేయించొచ్చు కానీ, బతిమిలాడుతున్నం.. ఇంకెంత కాలం సాగదీస్తారు? ఎవరి కోసం ఈ సాగదీత అని మంత్రి ప్రశ్నించారు.