డబుల్ బెడ్ రూం ఇల్లు అమ్ముకుంటే చర్యతీసుకుంటాం

డబుల్ బెడ్ రూం ఇల్లు అమ్ముకుంటే చర్యతీసుకుంటాం

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరులో 150మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను అందజేశారు మంత్రి హరీష్ రావు. దీంతో పాటు..  141 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను, గ్రామా పంచాయతీ అభివృద్ధి కోసం కొత్తగా ట్రాక్టర్లను సర్పంచ్ లకు  అందజేశారు. మీడియా తో మాట్లాడిన ఆయన… హైదరాబాద్ లో ఉన్న అపార్ట్ మెంట్ ల లాగా ఉన్న డబుల్ బెడ్ రూంలను లబ్ధిదారులకు ఇవ్వడం   సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాదన కోసం ప్రణాలువిడిచిన అమరుల పేర్లు ఆయా… బ్లాక్ లకు పెట్టనున్నట్లు తెలిపారు.

అమరుల త్యాగంవల్లే రాష్ట్రం సాకారమయ్యిందని అన్నారు హరీష్ రావు. వారి భాటలోనే మనమందరం నడవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కట్టించి ఇచ్చిన ఇండ్లలో వాళ్లే నివసించాలని… అమ్ముకోవద్దని కోరారు. ఒక వేల అమ్ముకుంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

226 మందికి 2కోట్ల 26 లక్షల 200 వందల రూపాయల చెక్కులను పేద ఆడపిల్ల కుటుంభలకు ఆసరాగా లక్ష రూపాయల చెక్కును ఇచ్చిన ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఆడపిల్ల పెళ్లి అయ్యాక ఒక్క రూపాయి ఖర్చు లేకుండా డెలివరీతో పాటు కేసీఆర్ కిట్టు ఇచ్చి 12వెల రూపాయల చెక్కు ఇచ్చి తల్లి పిల్లలను క్షేమంగా కేసీఆర్ ప్రభుత్వం ఇంటికి చేరుస్తుందని అన్నారు.

దేశమంతటా వర్షాలు పడి ప్రాజెక్టులు పొంగిపొర్లుతుంటే  సింగూర్ లో మాత్రం చుక్క వర్షం పడటం లేదని అన్నారు హరీష్. ఇలాగే జరిగితే.. భవిష్యత్తులో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సింగూర్ నింపుతామని చెప్పారు. 40 వేల ఏకరాలకు రెండు పంటలకు నిరందిస్తామని చెప్పారు. అందోల్ నియోజకవర్గంలో సాగుకు లక్ష ఏకరాలకు సాగునీరు అందిస్తామని ఆయన అన్నారు.