ఆన్​లైన్ లో జూపార్క్ టికెట్స్ బుకింగ్

ఆన్​లైన్ లో జూపార్క్ టికెట్స్  బుకింగ్

హైదరాబాద్ లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా రూపొందించిన నెహ్రూ జూ పార్క్ కొత్త వెబ్ సైట్, మొబైల్ యాప్ ను మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ఇవాళ ప్రారంభించారు. సందర్శకులు సులువుగా జూ ఎంట్రీ టికెట్ బుకింగ్, బ్యాటరీ వెహికల్స్ ఆన్​లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్టు జూ అధికారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీజీజీ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నిమ్జే, పీసీసీఎఫ్ అండ్ హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, అటవీ శాఖ జాయింట్ సెక్రటరీ ప్రశాంతి, జూ పార్క్ క్యూరేటర్ రాజశేఖర్ పాల్గొన్నారు.

ఇక హైదరాబాద్‌లో టూరిస్ట్ ప్రదేశాల్లో ‘నెహ్రూ జులాజికల్ పార్క్’ ఎంతో ముఖ్యమైనది. జీవవైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న జూ పార్క్ 380 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ జంతు ప్రదర్శనశాలలో దాదాపు 1,500 జాతుల జంతువులు, పక్షులు ఉన్నాయి.దేశంలోనే అతిపెద్ద జూపార్క్‌గా పేరు తెచ్చుకున్న నెహ్రూ జూ పార్క్‌కు 1959లో బీజం పడగా.. అక్టోబరు 12, 1963 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.