విభజన హామీలు నెరవేర్చడంలో బీజేపీ విఫలం

విభజన హామీలు నెరవేర్చడంలో బీజేపీ విఫలం

తెలంగాణ విషయంలో కేంద్రం క్షుద్ర రాజకీయం చేస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇన్నాళ్లకు బీజేపీ కి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గుర్తుకు రావడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. తెలంగాణ పై నిత్యం విషం కక్కుతున్న మోడీ మంత్రి వర్గంలోని కీలక మంత్రి అమిత్ షా ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనడాన్ని  తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. విభజన హామీలు నెరవేర్చడంలో విఫలమైన బీజేపీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరపడం ఒక డ్రామా అన్నారు. హైదరాబాద్ లో 24 గంటలు కరెంటు ,పుష్కలంగా వాటర్ ఉండటం వల్లనే జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడ నిర్వహిస్తున్నారన్నారు. సమావేశాలకు వచ్చిన బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ఇక్కడ అభివృద్ధిని చూసి నేర్చుకొని పోతే మంచిదన్నారు. 8 ఏండ్ల క్రితం తెలంగాణాలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు గుజరాత్ లో ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ కి వస్తున్నాడానే, బీజేపీ అగ్ర నాయకత్వం మొత్తం ఉలిక్కిపడి హైదరాబాద్ వస్తుందన్నారు.

మరిన్ని వార్తల కోసం

కాలుష్యం గుప్పిట్లో యమునా నది

కుటుంబ పాలనతో అప్పుల తెలంగాణగా మారింది