కేంద్ర మంత్రులను నిలదీయాలె : మంత్రి జగదీష్ రెడ్డి

కేంద్ర మంత్రులను నిలదీయాలె : మంత్రి జగదీష్ రెడ్డి

కేసీఆర్ చేసిన అభివృద్ధి చూసి పక్క రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో 6,7 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారని.. కేసీఆర్ చేసిన అభివృద్ధి చూసి మీ రాష్ట్రాలలో చేసుకోండని హీతవు పలికారు. కేంద్ర మంత్రులు తెలంగాణలోకి వొచ్చి మీటింగ్ లు పెడితే మీ కాడ ఏమి అభివృద్ధి జరిగిందో నిలదీయండని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో ఆకలి కేకలు లేవు..తెలంగాణ తప్ప దేశవ్యాప్తంగా 35 శాతం ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఆరోపించారు. మోడీ  పేద ప్రజల జేబులు కొడితే.. కేసీఆర్ పేద ప్రజల కడుపు నింపుతుండని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో రైతులు రైతు బంధు, రైతు భీమా అడుగుతున్నారని గుర్తు చేశారు. వ్యవసాయ రంగాన్ని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరన చేస్తున్న మోడీని కేసీఆర్ నిలదీసింది నిజం కాదా మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.