రూ.2 వేల నోట్ల రద్దు.. దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీసే కుట్ర : మంత్రి జగదీష్ రెడ్డి

రూ.2 వేల నోట్ల రద్దు.. దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీసే కుట్ర : మంత్రి జగదీష్ రెడ్డి

దేశంలో రెండు వేల నోట్ల రద్దు అనేది మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో అభివృద్ధిని వెనక్కు తీసుకపోవడమే అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మే 20వ తేదీ శనివారం ఆయన సూర్యపేట జిల్లాలో మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దుతో దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీసే కుట్ర జరుగుతుందన్నారాయన. గతంలో నోట్ల రద్దుతో ఎలాంటి ప్రయోజనాలు జరిగాయో చెప్పలేదని.. ఇది దేశానికి ఉపయోగపడే పని కాదని తెలిపారు.

కొందరి ప్రయోజనాల కోసమే నోట్ల రద్దు చేస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. మోడీ నమ్ముతున్న మత విశ్వాసాలతో ప్రజలను ఆకలితో ఉంచడం కోసం చేస్తున్నా పని అని జగదీష్ రెడ్డి విమర్శించారు. కొత్త పెట్టుబడిదారులతో మోడీ రహస్య ఎజెండాలో బాగమే రెండు వేల నోట్ల రద్దు అనేది ఆర్ధిక నిపుణుల భావన అని మంత్రి జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు.