వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయాలి...మంత్రి జగదీశ్​​ రెడ్డి

వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయాలి...మంత్రి జగదీశ్​​ రెడ్డి

తుంగతుర్తి, వెలుగు: రైతులు వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేస్తే అధిక లాభాలు ఉంటాయని  విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి  చెప్పారు. సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం  ఏరువాక కార్యక్రమాన్ని సొంత పొలంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వెదజల్లే పద్ధతిలో వరిపంట ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అనంతరం మంత్రి  మాట్లాడారు. గతంలో వ్యవసాయానికి  వర్షాలపై ఆధారపడే వాళ్లమని,  నేడు తెలంగాణ ప్రభుత్వ హాయంలో అటువంటి బాధలు ఏమీ లేవన్నారు.

 వ్యవసాయానికి 24 గంటల కరెంటు, ఎస్సారెస్పీ కాలువ ద్వారా జలాలను అందించి వ్యవసాయ సాగును పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఇరిగేషన్ సీఈ రమేశ్​ బాబు, డీఈ పిచ్చయ్య, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ గుండ గాని అంబయ్య గౌడ్​, కూరం వెంకన్న, దోమల బాలమల్లు, చిప్పలపల్లి సోమయ్య, దేవరకొండ మురళి పాల్గొన్నారు.