స్టేజ్ మీదే మైకులు లాక్కుని గొడవ పడ్డ మంత్రి, ఎమ్మెల్యే

స్టేజ్ మీదే  మైకులు లాక్కుని గొడవ పడ్డ  మంత్రి, ఎమ్మెల్యే

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో ఏర్పాటుచేసిన కొత్త రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రి జగదీష్ రెడ్డి రాగానే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. మునుగోడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదని నిరసన తెలిపారు. మంత్రి జగదీశ్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఒకరి మైకులు ఒకరు లాక్కొని స్టేజి పైనే దూషించుకున్నారు.   మైకు లాక్కున్న రాజగోపాల్ రెడ్డిని..చిల్లరగానివి అని  జగదీష్ రెడ్డి దూషించారు. కాంగ్రెస్ కార్యకర్తలను సభ నుంచి బయటకు పంపించారు పోలీసులు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. ప్రభుత్వ కార్యక్రమలకు తమకు సమాచారం లేకుండా మంత్రి వచ్చిపోవడం ఎమ్మెల్యే లను అవమానపరచడమేనన్నారు.  మంత్రిగా ఉంటే నియోజక వర్గంలో ఒక్క చోట ప్రారంభించి మిగతా కార్యక్రమాలను ఎమ్మెల్యేకి వదిలెయ్యాలన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు ప్రవేశ పెట్టడం కాదు.. సమస్యలు పరిష్కరించాలన్నారు. మంత్రి జగదీష్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. సీఎం కేసీఆర్ తో కొట్లాడి మునుగోడు నిధులు అందించాలన్నారు. లేకపోతే తన నియోజకవర్గంలో ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించిన ఇలాగే ఉంటుందని సవాల్  చేశారు.  శివన్నగూడ, ఎస్ ఎల్ బిసి ప్రాజెక్టులకు కనీసం ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదని ,దమ్ముంటే ప్రాజెక్ట్ లు పూర్తి చేయాలన్నారు.