దేశ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర అవసరం: మంత్రి జగదీష్ రెడ్డి

దేశ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర అవసరం: మంత్రి జగదీష్ రెడ్డి

ఖమ్మంలో ఈనెల 18న జరగనున్న సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలన్నారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర అవసరమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్నారని జగదీష్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ సభకు ముగ్గురు ముఖ్యమంత్రులతో పాటు దేశంలోని మరికొంతమంది నాయకులందరూ హజరవుతారని ఆయన స్పష్టం చేశారు.