ప్రజలు తిరగబడుతారన్న భయం బీజేపీని వెంటాడుతోంది

ప్రజలు తిరగబడుతారన్న భయం బీజేపీని వెంటాడుతోంది

సూర్యాపేట జిల్లా : రాష్ట్ర జనాభాలో 60 శాతం కుటుంబాలకు ఆసరా పింఛన్లు అందిస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ర్టం గుజరాత్ లో 20 శాతం కుటుంబాలు మాత్రమే పెన్షన్లు తీసుకుంటున్నాయని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఆసరా పింఛన్ రూ.750 ఇస్తున్నారని, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేవలం రూ.600 మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ప్రజలు తిరగబడుతారన్న భయం బీజేపీని వెంటాడుతోందని, అందుకే కేంద్రం నుండి రావాల్సిన నిధులు, రుణాలు రాకుండా మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలో నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వంపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క సంక్షేమ పథకంలోనూ అవినీతి జరగకుండా నేరుగా లబ్ధిదారులకే అందిస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు రుణమాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ప్రతి ఏడాది ఎకరానికి పెట్టుబడి సాయంగా రైతులకు రూ.10 వేలు అందిస్తున్నామని తెలిపారు.