కేసీఆర్ భాషను చూసి జనం చీదరించుకుంటున్నారు... మంత్రి జూపల్లి

కేసీఆర్ భాషను చూసి జనం చీదరించుకుంటున్నారు... మంత్రి జూపల్లి

తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న జనజాతర బహిరంగ సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ పై ఘాటైన విమర్శలు చేశారు.కేసీఆర్ భాషను చూసి జనం చీదరించుకుంటున్నారని అన్నారు.కేసీఆర్ భాషను చూసి ప్రజలే తిరగబడతారని అన్నారు. కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేయటానికి కేటీఆర్ కు బుడ్డి ఉండాలని అన్నారు. త్యాగాలు చేసి తెలంగాణ తెస్తే కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారని అన్నారు.

దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిది అని, రాహుల్ గాంధీని ప్రధాని చేయాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని అన్నారు.2009లో రాహుల్ కి ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తిరస్కరించారని అన్నారు.త్యాగాలు అంటే గాంధీ ఫ్యామిలీవే అని అన్నారు జూపల్లి. కేసీఆర్ అవినీతికి సాక్ష్యం కవిత జైలుపాలు కావటమే అని అన్నారు.