నాటకాల్లో కేసీఆర్ దిట్ట .. ఎన్నికలొస్తున్నందునే జలవివాదం : మంత్రి జూపల్లి

నాటకాల్లో కేసీఆర్ దిట్ట ..   ఎన్నికలొస్తున్నందునే జలవివాదం  : మంత్రి జూపల్లి


హైదరాబాద్: నాటకాలాడటంలో కేసీఆర్ దిట్ట అని, పార్లమెంటు ఎన్నికలు వస్తున్నందునే జలవివాదాన్ని తెరపైకి తెచ్చి సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.  కృష్ణానదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితిలోనూ అప్పగించబోమని చెప్పారు. అసలు ప్రాజెక్టుల ఒప్పగింతకు ఒప్పుకున్నదే కేసీఆర్ అని చెప్పారు. కేసీఆర్.. కమీషన్ల కోసం ఆదరాబాదరా కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్మిషన్లు తెచ్చుకున్నారని ఆరోపించారు. అక్కడ జగన్, ఇక్కడ కేసీఆర్ ఇద్దరూ కలిసి ఈ కొత్త నాటకానికి తెరలేపారని అన్నారు. కృష్ణా లో నీటి వాటా కోసం కనీసం కేంద్రాన్ని అడగలేదు హక్కుల కోసం డిమాండ్ చేయలేదని చెప్పారు. 

69 శాతం పరివాహక ప్రాతం ఉన్నా.. నీటి వాటా సాధించలేక పోయారన​ అన్నారు. దీనిపై తెలంగాణ శాసన సభలో తీర్మానం చేయలేదని, కేంద్రాన్ని కోరలేదని గుర్తు చేశారు.  సుప్రీంకోర్టు ఉన్న ఒక్క కేసును ఉపసంహరించుకున్నారు. హామీ ఇవ్వకుండానే విత్ డ్రా చేసుకున్నారన్నారు. రాయలసీమలో ప్రాజెక్టు కట్టేందుకు జగన్ కు సహకరించారన్నారు. 

ALSO READ :- వరంగల్లో కబ్జాలను ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి

 ఏఐసీసీ నేత వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ.. నీళ్ల, నిధులు, నియామకాలు పేరుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకున్నదన్నారు. నిందమోపడం, అవినీతిని, అసమర్థతను కప్పిపుచ్చుకొనేందుకే నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు.