ఆనాడు మీ నాయన చేసిన పనేంది.. అప్పుడు మీకు సిగ్గు లేదా..? కేటీఆర్‎పై మంత్రి జూపల్లి ఫైర్

ఆనాడు మీ నాయన చేసిన పనేంది.. అప్పుడు మీకు సిగ్గు లేదా..? కేటీఆర్‎పై మంత్రి జూపల్లి ఫైర్

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సిగ్గుందా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. శుక్రవారం (సెప్టెంబర్ 12) ఆయన గాంధీభవన్‎లో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ వ్యాఖ్యలు సిగ్గు చేటన్నారు. ఎమ్మెల్యేలను సిగ్గుందా అని కేటీఆర్ మాట్లాడటం తగదన్నారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు మీ నాయన కేసీఆర్ చేసిన పనేంది..? మీరు ఆనాడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదా..? ఆనాడు మీరు పక్క పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు మీకు సిగ్గులేదా అని కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్లు దోచుకుని ఇప్పుడు సిగ్గుందా అని మాట్లాడటం విడ్డూరం అన్నారు. 

ALSO READ : పరీక్షల సన్నద్ధతలో ఉండండి.. 

కేటీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు విషయంలో ఏదున్నా స్పీకర్ చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని తాను అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు తన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.