మానవత్వం చాటుకున్న మంత్రి జూపల్లి

మానవత్వం చాటుకున్న మంత్రి జూపల్లి

షాద్ నగర్,వెలుగు:  ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోయిన వ్యక్తికి మంత్రి జూపల్లి కృష్ణారావు సాయమందించి  మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం మంత్రి జూపల్లి హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ కు వెళ్తున్నారు.  రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఫిట్స్ వచ్చి ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. వెంటనే చూసిన మంత్రి కారు దిగి అంబులెన్స్ కు  సమాచారం ఇచ్చారు.  తన అనుచరులతో బాధితుడిని హాస్పిటల్ కు తరలించారు. దీంతో హై వేపై వెళ్తున్న వాహనదారులు మంత్రి చొరవను, సాయాన్ని అభినందించారు.