
నిర్మల్, వెలుగు: రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఆయన నిర్మల్లో పర్యటించారు. డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరిరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, ఆయనకు స్వాగతం పలికారు. మినీ ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహానికి మంత్రి నివాళి అర్పించారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను ఎవరూ మరువొద్దని కోరారు. మాజీ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, రేఖా నాయక్ తదితరులు పాల్గొన్నారు.