వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి : జూపల్లి కృష్ణారావు

వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి : జూపల్లి కృష్ణారావు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వ్యాయామం అలవాటు చేసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. బుధవారం పట్టణంలోని జడ్పీ గ్రౌండ్​లో పోలీస్  స్పోర్ట్స్  మీట్  ముగింపు కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి కనీస వ్యాయామం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో పోలీస్  అధికారులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ఆటల్లో ఆసక్తి, ప్రతిభ ఉన్నవారిని గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాలని, అందుకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. కలెక్టర్  పి ఉదయ్ కుమార్  మాట్లాడుతూ జిల్లాలో స్పోర్ట్స్  మీట్  జరగడం ఇదే తొలిసారని, దీనిని ఏర్పాటు చేసిన ఎస్పీని అభినందించారు. ఎస్పీ గైక్వాడ్  వైభవ్, అడిషనల్  ఎస్పీ రామేశ్వరరావు, డీఎస్పీ మోహన్ కుమార్, సీఐ విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

కుడికిల్ల గ్రామాన్ని డెవలప్​ చేస్తా

కొల్లాపూర్ : మండలంలోని కుడికిల్ల గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మంత్రి  జూపల్లి కృష్ణారావు తెలిపారు. గ్రామంలో నిర్మించిన రైతు వేదిక, జీపీ బిల్డింగ్, ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మైసమ్మ దేవస్థానంలో చైర్మన్ గా బుడుగు శ్రీనివాస్​ ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు మంత్రి మైసమ్మ తల్లిని దర్శించుకున్నారు. పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో సర్పంచులను శాలువాలతో సన్మానించారు. ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్, జడ్పీటీసీ మేకల గౌరమ్మ చంద్రయ్య పాల్గొన్నారు.

వీపనగండ్ల : చిన్నంబావి మండలం భెక్కం, గడ్డ భస్వాపురం గ్రామాల్లో కొత్తగా నిర్మించిన జీపీ బిల్డింగ్​లను మంత్రి ప్రారంభించారు. వచ్చే ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్​ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు.