ఖజురహోలో మంత్రి కిషన్ రెడ్డి బైక్ ర్యాలీ

ఖజురహోలో మంత్రి కిషన్ రెడ్డి బైక్ ర్యాలీ

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుల్లెట్ బండి నడుపుతూ సందడి చేశారు. తలకు పాగా, మెడలో కాషాయ జెండా బుల్లెట్ వెనుక త్రివర్ణం పతాకం పెట్టుకుని బండి నడిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా పిలవబడే ఖజురహోలో బైక్ ర్యాలీ జరిగింది. బీజేపీ శ్రేణులు, స్థానికంగా ఉండే ప్రజలతో కలిసి ఆయన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు. ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. 
 

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా... ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట భారీ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. పలు రాష్ట్రాల్లో వేడుకలు జరుగుతున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు దేశ ప్రజలంతా ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలని ‘హర్ ఘర్ తిరంగా’ పేరిట ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగాలో భాగంగా శనివారం దేశ వ్యాప్తంగా తిరంగా బైక్ ర్యాలీలు జరిగాయి. ఇందులో పాల్గొనేందుకు మధ్యప్రదేశ్ పర్యటనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లారు.