బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి

దేశంలో ఎక్కడా లేని విధంగా బోనాల పండగను తెలంగాణలో జరుపుకుంటామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీలో జరగుతున్న బోనాల ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు మాత్రమే బోనాల పండుగ ప్రత్యేకమైందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది బోనాలను కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించేలా ప్రయత్నిస్తానన్నారు.

దేశంలో ఎలాంటి వైపరిత్యాలు, రోగాలు రాకుండా అందరూ మంచిగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.