బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురే: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురే: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • అన్ని పదవులు కేటీఆర్ కు ఇస్తే ఎవరూ ఉండరు
  • కేసీఆర్ కు రేవంత్ ను ఎదుర్కొనే శక్తిలేదు
  • అందుకే అసెంబ్లీకి రావడం లేదు
  • నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

యాదాద్రి: బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది కేవలం నలుగురేనని మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్​ మాత్రమే ఆ పార్టీలో ఉంటారన్నారు. బీఆర్ఎస్ లో కీలకమైన పదవులన్నీ కేటీఆర్ కే అప్పగిస్తే భవిష్యత్తు లో జరిగేది అదేనన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కొడుకు అసెంబ్లీకి వస్తే అల్లుడు హరీశ్ రావు పార్టీ మారుతారని చెప్పారు.  ఇవాళ భువనగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారుకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదన్నారు.

ALSO READ :- రైతులు, ఆఫీసర్లు, యాజమాన్యంతో చర్చించాం: శ్రీధర్ బాబు

 కేసీఆర్ పదేండ్లలో తెలంగాణను సర్వనాశనం చేశారని, కోట్లాది రూపాయల అప్పులు చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని వందేండ్ల వెనక్కి నెట్టే విధ్వంసాన్ని సృష్టించారని అన్నారు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే శక్తి లేదని, అందుకే అసెంబ్లీకి రావడం లేదని చెప్పారు. బీఆర్ఎస్ లాగా తాము కూడా కాంగ్రెస్ లో చేర్చుకుంటే ఆ పార్టీలో కేవలం నలుగురే మిగులుతారని అన్నారు. కేసీఆర్ కు వేరే మార్గం లేక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాళ్లు పట్టుకున్నారని అన్నారు. ఎల్ఆర్ఎస్ గైడ్ లైన్స్ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే మోదీ కన్నా ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పారు.