ఎమ్మెల్యే లాస్య నందిత ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం: మంత్రి కోమటిరెడ్డి

ఎమ్మెల్యే లాస్య నందిత ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం: మంత్రి కోమటిరెడ్డి

ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. లాస్య మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి గాంధీకి చేరుకుని.. లాస్య కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ  సందర్భంగా వారికి మనోధైర్యం చెప్పారు. అంనతరం గాంధీ వైద్యులతో మంత్రి మాట్లాడారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడం చాలా బాధాకరమన్నారు.  ప్రభుత్వ లాంఛనాలతో లాస్య అంత్యక్రియలను జరుపుతామన్నారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే తీవ్రంగా గాయపడి ఆమె మరణించినట్లు పోలీసులు చెప్పారని.. ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ పెట్టుకోవాలన్నారాయన. కంటోన్మెంట్ లో లాస్య నందిత ఇచ్చిన హామీలను నెరవేరస్తామని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి.

పోస్ట్ మార్టం అనంతరం ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయాన్ని .. సికింద్రాబాద్, కార్ఖానా, కాకగూడలోని నివాసానికి తరలించి కార్యకర్తులు, అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తర్వాత ఈస్ట్ మారేడిపల్లి స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.