
- గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లేఖ రాశారు. సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్టక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) స్కీమ్ కింద రాష్ర్టంలో 410 కి.మీ. మేర రోడ్ల విస్తరణ చేపట్టాల్సి ఉందని, ఇందుకోసం రూ. 868 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.
మొత్తం 35 నియోజకవర్గాల్లో 34 రోడ్ల ప్రతిపాదనలు, రోడ్డు పేరు, కిలోమీటర్లు, విస్తరణకు అయ్యే ఖర్చు వివరాలను లేఖలో పేర్కొన్నారు. కేంద్రం ఈ నెలాఖరు వరకు నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని ఆర్ అండ్ బీ అధికారులు చెబుతున్నారు. కాగా, డీజిల్, పెట్రోల్ మీద వసూలవుతున్న సెస్ అమౌంట్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ర్టాల్లో రోడ్ల విస్తరణకు సీఆర్ఐఎఫ్ స్కీమ్ కింద నిధులు కేటాయిస్తోంది.