
తెలంగాణ ఐకానిక్ గా ఢిల్లీలో తెలంగాణ భవన్ ఉంటుందన్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. రెండు నెలల్లో ఢిల్లీలో తెలంగాణ భవన్ కు టెండర్లు పిలుస్తామని చెప్పారు. త్వరలో అనుమతులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ హౌజ్ పక్కన తెలంగాణ భవన్ నిర్మాణం ఉంటుందన్నారు మంత్రి.
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు కార్యక్రమానికి అటెండయ్యారు. తన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టిన జితేందర్ రెడ్డిని అభినందించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి.