నల్గొండ ను హైదరాబాద్‌‌ కు దీటుగా అభివృద్ధి చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

నల్గొండ ను హైదరాబాద్‌‌ కు దీటుగా అభివృద్ధి చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 
  • రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌‌లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి  చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడం అభినందనీయమని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన నల్గొండకు వచ్చి క్లాక్​టవర్​ వద్ద గెలిచిన కార్పొరేటర్లు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.  నల్గొండ అంటే కాంగ్రెస్..  కాంగ్రెస్ అంటే నల్గొండ అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందన్నారు.  మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గెలుపొందిన అభ్యర్థులంతా అభివృద్ధి కోసం కృషి చేయాలని, గెలుపోటములు సహజమన్నారు. ఇక నుంచి ప్రతి డివిజన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తానని వెల్లడించారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తిప్పర్తి మాజీ జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, కార్పొరేటర్లు ఇటికాల మంగమ్మ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.