బహుజనుల పోరాట పటిమకు సర్వాయి పాపన్న ప్రతీక : కొండా సురేఖ

బహుజనుల పోరాట పటిమకు సర్వాయి పాపన్న ప్రతీక : కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు: బహుజనుల ఆత్మగౌరవానికి, పోరాట పటిమకు సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం సర్వాయి పాపన్న గౌడ్ 314వ వర్ధంతి సందర్భంగా మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. రాచరికాన్ని ఎదిరించి, గోల్కొండను జనరంజకంగా సర్వాయి పాపన్న పాలించారని తెలిపారు. ఆయన అసమాన పోరాట యోధుడని పేర్కొన్నారు. పాపన్న గౌడ్ స్ఫూర్తితో ప్రజా సంక్షేమమే పరమావధిగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని మంత్రి సురేఖ వెల్లడించారు.