సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా: మంత్రి కేటీఆర్

సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా: మంత్రి కేటీఆర్

తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని మంత్రి కేటీఆర్ తెలిపారు. తన ఆరోగ్యం విషయమై సోమవారం నుంచి కొంతమంది ఆందోళన చెందుతున్నారని ట్విట్ట‌ర్ లో తెలిపిన మంత్రి .. ‘నా ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. తాను కొన్నేళ్లుగా జలుబుతో కూడిన అలర్జీతో బాధపడుతున్నానని… సోమ‌వారం సిరిసిల్ల పర్యటన సందర్భంగా అలాంటి జలుబు కారణంగానే కొంత ఇబ్బందిపడ్డానని ఆయన వివరించారు. అయితే అప్పటికే పర్యటనకు సంబంధించిన పలు కార్యక్రమాలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో హఠాత్తుగా పర్యటన రద్దు చేసుకుంటే… చాలామంది ఇబ్బందిపడతారనే కార్యక్రమాన్ని కొనసాగించాల్సి వచ్చిందని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. దీని వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించాలని కేటీఆర్ ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. అంతకుముందు కేటీఆర్ జలుబుతో బాధపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.