సాగర్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం

సాగర్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం

హుస్సేన్ సాగర్ ఏరియాలో 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం త్వరలోనే రాబోతుందన్నారు మంత్రి కేటీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా 9,714 కోట్ల రూపాయలతో హైదరాబాద్ నగరంలో ఇండ్లు కడుతున్నామన్నారు. గతంలో ఇచ్చిన ఇండ్లు డబ్బాలు మాదిరిగా ఉండేవన్నారు. కానీ ఇప్పడు డబుల్ బెడ్ రూంలతో ఏ చిక్కు లేదన్నారు. ఇందిర నగర్ ఇండ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు మంత్రి. మెయింటైనెన్సు మంచిగా చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇండ్లు ఇస్తున్నపుడు వాటిని కాపాడుకునే బాధ్యత లబ్ధిదారులదే అన్నారు కేటీఆర్. 

నాలుగైదు రోజుల్లో కొల్లూరు డబుల్ బెడ్ రూం ఇండ్లను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారన్నారు. ఎచ్ఎండీఏకు చెందిన ఎకరం స్థలంలో కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ నిర్మిస్తామన్నారు. వంద కోట్ల విలువైన ఈ స్థలాన్ని GHMC కి అప్పగిస్తామన్నామన్నారు మంత్రి. జలవిహార్ కంటే అద్భుతంగా ఈ ఫంక్షన్ హాల్ నిర్మించాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం ఎవరికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అందరి ముందే డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు మంత్రులు కేటీఆర్, తలసాని.

ఇవి కూడా చదవండి: 

యోగా చేసేటప్పుడు.. ఇవి గుర్తుపెట్టుకోవాలి

మేడారం స్పెషల్ బస్సుల్లో ఒక్కరికి రూ.1000 పై మాటే