యోగా చేసేటప్పుడు.. ఇవి గుర్తుపెట్టుకోవాలి

యోగా చేసేటప్పుడు.. ఇవి గుర్తుపెట్టుకోవాలి

ఫిట్​నెస్​, రిలాక్స్​ కోసం యోగా చేస్తారు చాలామంది. కొందరు మొదట్లో చూపినంత ఇంట్రెస్ట్ తరువాత చూపించరు. దాంతో అనుకున్న రిజల్ట్ రాదు. ఇలాకాకుండా ఉండాలంటే యోగా చేసేటప్పుడు ఏమేం గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాడు యోగా మాస్టర్​ అక్షర్.

యోగా చేసేవాళ్లు రొటీన్​ని ఫాలో కావాలి. టైమ్​ ఉంది కదా అని ఎక్కువ సేపు యోగా చేయొద్దు. సూర్యనమస్కారం, చంద్రనమస్కారం వంటివి ఎప్పుడంటే అప్పుడు చేయకూడదు. వాటిని చేసేందుకు పర్టిక్యులర్​ టైం ఉంటుంది. యోగా చేసేముందు వామప్​ చేయాలి. కాలి మడమలు, మోకాళ్లు, మెడని అటుఇటు తిప్పాలి. ఇలాచేస్తే గాయాలు కావు. ఇవేకాకుండా హెల్దీఫుడ్​ తినడం, చాలినంత నిద్రపోవడం చాలా ముఖ్యం.