వాళ్లతో  దేశానికేం ఉపయోగం?: కేటీఆర్

వాళ్లతో  దేశానికేం ఉపయోగం?: కేటీఆర్
  • రాజ్ భవన్ ను రాజకీయ వేదికగా మార్చొద్దు
  • రాజ్యాంగ పదవుల్లో ఉన్నోళ్లు రాజకీయ వ్యాఖ్యలు మానుకుంటే మంచిది..
  • తెలంగాణకు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను కేంద్రం నేరవేర్చడం లేదు 

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారు కొన్ని పార్టీలకు అనుకూలంగా వ్యవహరించడం, పార్టీల తరఫున చర్చల్లో పాల్గొనడం, రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం మానుకుంటే మంచిదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక పార్టీ గురించే మాట్లాడుతూ, ఒక పార్టీ నాయకుల ఫొటోలే రాజ్ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టుకుంటూ రాజ్ భవన్ ను రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చడం దేశానికి, వ్యవస్థకు మంచిది కాదని చెప్పారు. సోమవారం సిరిసిల్లలో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ‘‘స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు నిండిన సందర్భంగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. దేశంలో బ్రిటిష్ కాలం నాటి స్లేవరీ (బానిసత్వం) పోవాలని, రాజ్ పథ్ పేరును కర్తవ్య పథ్ గా మార్చామని గొప్ప స్పీచ్ ఇచ్చారు. మరి బ్రిటీష్​వాళ్లు పెట్టిన గవర్నర్ వ్యవస్థను మాత్రం మోడీ ఎందుకు కొనసాగిస్తున్నారు? గవర్నర్ వ్యవస్థ అవసరం లేదని సర్కారియా, పూంచ్ కమిషన్లు చెప్పాయి. నాటి బ్రిటీష్ పాలనలో పైన వైస్రాయ్​, కింద గవర్నర్ ఉండే వాళ్లు. కానీ భారతదేశంలోని ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలో  ప్రజలు ప్రధానిని, ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. గవర్నర్​తో ఇప్పుడేమి ఉపయోగమో అర్థం కావడం లేదు. ప్రధాని పేరును వైస్రాయ్​ గానైనా మార్చుకోవాడమో, లేదంటే గవర్నర్ వ్యవస్థను ఎత్తేయడమో చేయాలి” అని అన్నారు. గవర్నర్ వ్యవస్థను టూల్ గా వాడుకోవడమేంటో మోడీకే తెలియాలన్నారు.

విభజన హామీలు నెరవేర్చాలి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలేదని కేటీఆర్ ఆరోపించారు. వరంగల్ జిల్లా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, తెలంగాణకు కొత్త విద్యాసంస్థలు, ఇండస్ట్రియల్​ కారిడార్లు, ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ ఇన్వెస్ట్​మెంట్ రీజియన్​ ఇస్తామని 2013లో తెలంగాణ బిల్లు పాసైనప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. డీలిమిటేషన్ కింద తెలంగాణ, ఆంధ్రాలో సీట్లు పెంచుతామని చెప్పినా పెంచలేదన్నారు. ‘‘తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేంద్రం నిధులు కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పన్నుల రూపంలో 3.68 లక్షల కోట్లు కడితే, రాష్ట్రానికి తిరిగి ఇచ్చింది 1.68 లక్షల కోట్లు మాత్రమే. 8 ఏండ్లలో తెలంగాణకు ఒక్కటంటే ఒక్క కొత్త రైల్వే లైన్ కూడా ఇవ్వలేదు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్ పోయే లైన్ కు ఫండ్స్​ కేటాయించలేదు. ఎనిమిదేండ్లలో తెలంగాణలో 100 కిలోమీటర్ల రైల్వే లైన్ కూడా వేయలేదు. మహారాష్ట్ర, గుజరాత్ లలో 20 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు” అని కేటీఆర్ ఆరోపించారు.తెలంగాణ నుంచి ఎంపీలుగా ఉన్న బండి సంజయ్​, సోయం బాపూరావు, అర్వింద్, కిషన్ రెడ్డి.. రాష్ట్రానికి నిధులు తేవడానికి కొట్లాడాలని కేటీఆర్ అన్నారు. వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు సహకరించాలని కోరితే కేంద్రం స్పందించడం లేదన్నారు.  

కేటీఆర్ వస్తున్నడని అరెస్టులు

హుజూరాబాద్: మంత్రి కేటీఆర్ వస్తున్నాడని హుజూరాబాద్ నియోజకవర్గంలో పలువురిని పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. సోమవారం తెల్లవారుజామునే హుజూరాబాద్ పోలీస్ స్టేషన్​కు తీసుకువచ్చి అక్కడి నుంచి సైదాపూర్ స్టేషన్​కు తరలించారు. 

రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిధులివ్వండి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రైల్వే బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోరారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సోమవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అన్యాయం జరుగుతూనే ఉందని, కనీసం ఈసారైనా తగినన్ని నిధులు కేటాయించాలని కోరారు. మోడీ నేతృత్వంలోని ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని రీ ఆర్గనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టారని గుర్తు చేశారు. ఉత్తర, దక్షిణ భారతాలకు సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాజీపేట జంక్షన్లు కనెక్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లుగా ఉన్నాయని.. తెలంగాణకు సముద్ర తీరం లేనందున సరుకు రవాణాకు రైల్వేలపైనే ఎక్కువ ఆధారపడుతున్నామని, దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. కొత్త రైల్వే లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల విస్తరణతో రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎనిమిదేళ్లలో వంద కి.మీ.ల పొడవైన ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే వేశారని తెలిపారు. ఎనిమిదేళ్లలో తెలంగాణకు కొత్తగా ఒక్క రైలు మాత్రమే ఇచ్చారని తెలిపారు.